జూన్ 15లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్

0చూసినవారు
జూన్ 15లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూన్ 15 లోపు రాష్ట్రంలోని విద్యార్థులందరికీ యూనిఫారాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ వ్యాఖ్యలు చేశారు. దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, ఐడీ కార్డులు వంటివి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారానే సేకరించాలని సూచించారు. సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రతి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని కూడా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్