పెళ్లికి ముందు యువకుడి ఆత్మహత్య!

651చూసినవారు
పెళ్లికి ముందు యువకుడి ఆత్మహత్య!
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో పెళ్లి వేడుక విషాదంలో మునిగిపోయింది. బుధవారం పెళ్లి జరగాల్సిన మల్లేశ్ (21) అనే యువకుడు మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధన్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్