వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం వనపర్తి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రెసిడెన్షియల్ స్కూళ్లలో 60 మంది పిల్లలు చనిపోయారని ఆరోపించారు. టీడీపీ, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాల పింఛన్ పథకాలను ప్రస్తావిస్తూ, కేసీఆర్ రూ. 2000 పింఛన్ ఇచ్చారని, కానీ రేవంత్ రూ. 4000 ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.