వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామం నుంచి నందిమల్ల వరకు 4 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతు చేయాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి సర్పంచ్ రంగారెడ్డితో పాటు పలువురు విజ్ఞప్తి చేశారు. గద్వాల నుంచి నందిమల్ల, మూలమల్ల మీదుగా బస్సులు నడిచేందుకు రోడ్డును బాగు చేయాలని పాలమూరు ఎంపీ డీకే అరుణను కోరగా, ఆమె కలెక్టర్‌కు రాసిన లేఖను సర్పంచ్ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ రోడ్డు మరమ్మతు అనేది మూలమల్ల-నందిమల్ల ప్రాంత ప్రజల ముఖ్యమైన అవసరం.