వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న డయాలసిస్ కేంద్రంలో నిర్వాహకులు సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 6 నుండి రాత్రి 8:30 గంటల వరకు మూడు షిఫ్టుల్లో డయాలసిస్ సేవలు అందిస్తారు. మొత్తం 5 బెడ్లతో, ప్రతి షిఫ్ట్ నాలుగు గంటల చొప్పున డయాలసిస్ నిర్వహిస్తారు. ఈ కేంద్రంలో శ్రీవాణి, సునీత, వరలక్ష్మి, శ్రీనివాసులు, అజయ్ విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ సేవలు 2026 జూన్ 29 నుండి అందుబాటులోకి వస్తాయి.