ఆత్మకూరు పెద్దమ్మ తల్లి పండుగ: భక్తులకు అన్ని సౌకర్యాలు సిద్ధం

882చూసినవారు
ఆత్మకూరు పెద్దమ్మ తల్లి పండుగ: భక్తులకు అన్ని సౌకర్యాలు సిద్ధం
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో నేడు, రేపు జరగనున్న పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్ తెలిపారు. సోమవారం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, తాగునీటి వసతి వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్