ఆదివారం వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో బీజేపీ నూతన కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు సూరీ ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ పదవిని గెలుచుకోవాలని, అన్ని వార్డులలో విజయం సాధించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అశ్విని కుమార్, జిందే శ్రీనివాసులు, ఆనంద్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.