వనపర్తి జిల్లా మేడేపల్లి గ్రామంలో పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని గ్రామ సర్పంచ్ చెన్నరాయుడు అన్నారు. ఆదివారం గ్రామంలోని పంచాయతీ వద్ద ఆరోగ్య సిబ్బందితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. మూడు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దొరబాబు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.