వనపర్తి జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) డే సందర్భంగా 108 అంబులెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి, డిస్టిక్ కోఆర్డినేటర్ బి రత్నమయ్య, EMTలు, పైలట్లు, ఇతర సిబ్బంది తమ సేవల ప్రాముఖ్యతను వివరించారు. 108 సేవలు 24 గంటలు ఉచిత అత్యవసర వైద్య సేవలను అందిస్తూ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా స్పందిస్తున్నాయి. ఒకే సంవత్సరంలో 14209 అత్యవసర కేసులకు సేవలు అందించినట్లు తెలిపారు. EMTలు సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి, రోగులను స్థిరపరిచి ఆసుపత్రికి తరలిస్తున్నారని, ఇది ప్రాణాలను కాపాడటంలో కీలకమని పేర్కొన్నారు. "ప్రతి ప్రాణం మాకు అమూల్యమైనది," అని ఒక EMT తెలిపారు.