వనపర్తి జిల్లా, గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలో రేపు గురువారం ఉదయం 10 గంటలకు గౌరవ సర్పంచ్ శారద సురేష్ నాయక్ అధ్యక్షతన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి నివేదిక సందర్భంగా గ్రామసభ నిర్వహించబడుతుంది. ఈ గ్రామసభకు గ్రామ సభ స్పెషల్ ఆఫీసర్ గా గోపాల్ పేట ఎమ్మార్వో తిలక్ రెడ్డి హాజరవుతారు. ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, రాజకీయ నాయకులు, అధికారులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శి సురేష్ కోరారు.