వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలోని దేవాలయంలో ఆదివారం శివ స్వాముల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం, పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. శివ స్వాముల భజనలు, కీర్తనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి చెన్నూరు సర్పంచ్ శారద సురేష్ నాయక్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.