వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నేటి నుంచి ఫిబ్రవరి 28 వరకు '30 పోలీస్ యాక్ట్-1861' అమలులో ఉంటుందని ఎస్పీ సునీతా రెడ్డి తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం జిల్లాలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉంటాయి.