వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కోళ్ల వెంకటేష్ నియామకం

763చూసినవారు
వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కోళ్ల వెంకటేష్ నియామకం
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కోళ్ల వెంకటేష్ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త కాపు శివసేనారెడ్డి సమక్షంలో వెంకటేష్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని చిన్నారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్