ఎస్టీలకు ఇందిరాగాంధీ రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ
కాంగ్రెస్ ఆదివాసి ప్రజాప్రతినిధులు చేపట్టిన 'ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర' శనివారం వనపర్తి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, గిరిజన వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.