విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యేలు జీఎంఆర్, మేఘారెడ్డి

948చూసినవారు
కొత్తకోటలోని బీసీ బాలికల వసతి గృహంలో 15 మంది విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) మరియు ఎమ్మెల్యే మేఘా రెడ్డి వెంటనే వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, విద్యార్థినులను పరామర్శించారు. ఎమ్మెల్యేలు విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

సంబంధిత పోస్ట్