మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జిల్లాలో 'బ్రహ్మోస్' మిస్సైల్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని విన్నవించారు.