యుద్ధ నివారణలో కేంద్రం విఫలం: సీపీఐ విమర్శ

95చూసినవారు
యుద్ధ నివారణలో కేంద్రం విఫలం: సీపీఐ విమర్శ
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు చొరవ చూపడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నరసింహ విమర్శించారు. ఆదివారం వనపర్తిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల అలీన విధానం ప్రస్తుత దౌత్యంలో లోపించిందని, దీనివల్ల దేశంలో ఇంధన కొరత ఏర్పడి సామాన్యులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, పింఛన్ల పెంపు వంటి హామీలను అరకొరగా అమలు చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయరాములు, కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు.