ఆత్మకూరులో మున్సిపల్ కమిషనర్ పర్యటన: పరిశుభ్రతపై ఆదేశాలు

1009చూసినవారు
ఆత్మకూరులో మున్సిపల్ కమిషనర్ పర్యటన: పరిశుభ్రతపై ఆదేశాలు
ఆత్మకూరు పట్టణంలోని వివిధ కాలనీలలో సోమవారం మున్సిపల్ కమిషనర్ పర్యటించి రోడ్లు, కాలువల పరిశుభ్రతను పరిశీలించారు. ప్రతిరోజూ రోడ్లను శుభ్రం చేసి, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సిబ్బందిని ఆదేశించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్