వనపర్తి జిల్లా బిజ్వరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ్‌దేవ్ పదవీ విరమణ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, నామ్‌దేవ్ 37 ఏళ్ల పాటు విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం శేఖర్ అయ్య, సర్పంచ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల చైర్మన్, కె.సి. వెంకటేష్, రాములు, నరేష్, రాంనాయక్, రాజలింగం, మనేపు రెడ్డి, రామలమ్మ, ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.