ఆత్మకూరు పెద్దమ్మతల్లి ఉత్సవాలకు మీడియాకు నో ఎంట్రీ: నిర్వాహకుల తీరుపై ఆగ్రహం

638చూసినవారు
ఆత్మకూరు పెద్దమ్మతల్లి ఉత్సవాలకు మీడియాకు నో ఎంట్రీ: నిర్వాహకుల తీరుపై ఆగ్రహం
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో కొన్నేళ్ల తర్వాత జరుగుతున్న పెద్దమ్మతల్లి మహోత్సవాలకు నిర్వాహకులు మీడియాకు అనుమతి నిరాకరించారు. భక్తుల ఆసక్తి మేరకు ప్రసారం చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను 'మీడియాకు అనుమతి లేదు, దయచేసి బయటికి వెళ్లండి' అని నిర్వాహకులు బాలు చెప్పడంతో మీడియా మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను అగౌరవపరచడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్