వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా, మంగళవారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శిరీష అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.