వనపర్తిలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే తూడిమేఘా రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు ఈ విషయాన్ని తెలిపారు. వనపర్తి పట్టణంలోని 1వ వార్డు రాయిగడ్డ వీధిలో అందరూ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చూడాలని ఆదేశించారు.