వనపర్తి జిల్లా అమరచింతలో సోమవారం రాత్రి జరిగిన ప్రజా గాయకుడు సాయిచంద్ 3వ వర్ధంతి వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాయిచంద్ మరణించలేదని, నిరుద్యోగులు,
విద్యార్థులు, రైతులు, కూలీలు ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఆయన ఎక్కడని అడుగుతున్నారని, ఆయన ప్రజా ఉద్యమ రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని కొనియాడారు. సాయిచంద్ ఆత్మ ప్రజా ఉద్యమంలో సజీవంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.