బాల కార్మికులపై కఠిన చర్యలు: ఎస్పీ సునీతా రెడ్డి హెచ్చరిక

98చూసినవారు
బాల కార్మికులపై కఠిన చర్యలు: ఎస్పీ సునీతా రెడ్డి హెచ్చరిక
వనపర్తి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎస్పీ సునీతా రెడ్డి అన్నారు. పిల్లల బాల్యం బడికే అంకితం కావాలని, వారు విద్యావంతులుగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ లైన్ నంబర్ 1098 లేదా అత్యవసర నంబర్ 112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. నిబంధనలు అతిక్రమించి బాలలతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్