వనపర్తిలో డ్రగ్స్ మాఫియాపై పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆదివారం సాయంత్రం అంబేద్కర్ చౌక్‌లో సౌమ్య చిత్రపటానికి నివాళులర్పించి, డ్రగ్స్ మాఫియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా NFIW జిల్లా అధ్యక్షురాలు కళావతమ్మ మాట్లాడుతూ, సౌమ్య ఆశయాలను కొనసాగించాలని, ఆమె మరణానికి కారణమైన వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. యువతులు సౌమ్య ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.