వనపర్తి నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం
కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల, గొల్లపల్లి రిజర్వాయర్ల ద్వారా వనపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరాకు కూడా నీరు అందే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నీటిని తీసుకునేందుకు రెగ్యులేటర్ ఏర్పాటు చేశామని చెబుతున్న నాయకులు, ఆ రెగ్యులేటర్ ఎత్తు మరియు దాని కింద ఉన్న బుద్దారం రిజర్వాయర్ ఎత్తు ఎంత ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రాజెక్టుల విషయంలో ప్రచారం చేసుకుందని మండిపడ్డారు.