యూరియా యాప్ పై డీలర్లకు శిక్షణ.. రైతులకు సులభతర బుకింగ్

125చూసినవారు
యూరియా యాప్ పై డీలర్లకు శిక్షణ.. రైతులకు సులభతర బుకింగ్
వనపర్తి జిల్లాలో, శుక్రవారం జుర్యాల గ్రామ రైతు వేదికలో ఆత్మకూర్, అమరచింత మండలాల డీలర్లకు యూరియా బుకింగ్ యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రైతులు నేరుగా మొబైల్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని, షాపులలో నేరుగా తీసుకునే వెసులుబాటు గురించి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి అరవింద్, విస్తరణ అధికారిణి గడదాస్ ఝాన్సీ పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ పంట అవసరాలకు అనుగుణంగా యూరియాను సులభంగా పొందవచ్చు.

సంబంధిత పోస్ట్