వనపర్తి మునిసిపల్ పరిధిలోని 33వ వార్డులో ఆర్యవైశ్య మహిళలు ఆసక్తికరంగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరపున మిడిదొడ్డి మాధవి రమేష్, బీజేపీ తరపున బచ్చు సౌజన్య రామకృష్ణ (రాము) బరిలో ఉన్నారు. బచ్చు రాము వనపర్తి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉండటంతో ఈ వార్డులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామం పట్టణంలో చర్చనీయాంశమైంది.