వనపర్తి: రేవంత్ పాలనలో గురుకులాలు సంక్షోభం: నిరంజన్ రెడ్డి

0చూసినవారు
వనపర్తి: రేవంత్ పాలనలో గురుకులాలు సంక్షోభం: నిరంజన్ రెడ్డి
కేసీఆర్ హయాంలో గురుకులాలు సంక్షేమంగా ఉండేవని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో అవి సంక్షోభంలో ఉన్నాయని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కొత్తకోట హాస్టల్‌లో విద్యార్థినులు విషాహారం తిని అస్వస్థతకు గురవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. ఆహారం బాలేదని విద్యార్థులు మొరపెట్టుకున్నా పట్టించుకోని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మండిపడ్డారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఒక్క రోజూ సమీక్షించలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్