వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ అనంతరం, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం హాస్టల్ వార్డెన్, ఇద్దరు వర్కర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదనపు రెవెన్యూ కలెక్టర్ ఖిమ్యా నాయక్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేయబడింది.