వనపర్తి మున్సిపల్ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థి సౌజన్య నామినేషన్ దాఖలు

347చూసినవారు
వనపర్తి మున్సిపల్ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థి సౌజన్య నామినేషన్ దాఖలు
వనపర్తి మున్సిపల్ ఎన్నికల బరిలో 33వ వార్డు బీజేపీ అభ్యర్థిగా బచ్చు రాము భార్య సౌజన్య నామినేషన్ దాఖలు చేశారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల అనంతరం మున్సిపల్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేశారు. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కేంద్ర పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి చేరవేస్తానని సౌజన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జ్ రాజేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుమిత్రమ్మ, గట్టు అరుణ్, బచ్చు వెంకటేష్, ఎలిశెట్టి వెంకటేష్, ఏపూరి శ్రీనివాసులు, గోవిందు, జయంతి శ్రీనివాసులు, జ్ఞానేశ్వర్, బాలయ్య, సరోజ, కవిత, సత్తి, అనిల్ గౌడ్, అర్జున్ చంటి మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి జైని శ్రీనివాస్ గుప్త అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్