వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను వారంలో పరిష్కరించాలి: కలెక్టర్

29చూసినవారు
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను వారంలో పరిష్కరించాలి: కలెక్టర్
వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులు స్వీకరించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను వారంలోగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్