వనపర్తి: కిందికి దూసుకెళ్ళిన ట్రాక్టర్.. ట్రాఫిక్ అంతరాయం

18చూసినవారు
వనపర్తి జిల్లా పెద్దగూడెం శివారు అటవీ ప్రాంతంలో పెబ్బేరు ప్రధాన రోడ్డులో శుక్రవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోడ్డు కిందికి దూసుకెళ్ళింది. అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ యజమానులు మరో ట్రాక్టర్ తెచ్చి తాళ్లు కట్టి లాగి వెలికి తీశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ట్రాక్టర్ల డ్రైవర్లు నిర్లక్ష్యాన్ని వీడి జాగ్రత్తగా నడపాలని పలువురు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్