వనపర్తి మండలం రాజనగరంలో శుక్రవారం నక్క రాకేశ్ (20) అనే యువకుడు తాత మరణంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాతపై ఉన్న మమకారంతో యువకుడు తనువు చాలించడం గ్రామంలో విషాదం నింపింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, గోపి మాధవిలను పరామర్శించి ధైర్యం చెప్పారు.