జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

678చూసినవారు
జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
లోయర్ జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో కృష్ణా నదిలో ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఆత్మకూరు మండలం జూరాల గ్రామం నుంచి గద్వాల జిల్లా కొత్తపల్లి వరకు నది గుండా సాగే రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆత్మకూరు SI జయన్న సోమవారం తెలిపారు. నది వైపు ఎవరూ వెళ్లరాదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని ఆయన ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్