గొర్రెల వ్యాపారంలో నష్టం, అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

700చూసినవారు
గొర్రెల వ్యాపారంలో నష్టం, అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
పెబ్బేరు మండలం కంచిరావుపల్లికి చెందిన 28 ఏళ్ల విష్ణు, గొర్రెల వ్యాపారంలో నష్టం, అప్పుల బాధతో మనస్థాపానికి గురై, ఈనెల 19న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వనపర్తి, అక్కడి నుండి కర్నూలు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ గౌడ్ శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్