తాడిపర్తి-చెన్నూరు రోడ్డు పనులు ప్రారంభించాలన్న యువత

931చూసినవారు
తాడిపర్తి-చెన్నూరు రోడ్డు పనులు ప్రారంభించాలన్న యువత
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపర్తి నుంచి చెన్నూరుకు వెళ్లే రహదారికి బీటీ రోడ్డు నిర్మించాలని చెన్నూరు బంజారా యూత్ నాయకులు నరేష్ నాయక్, రాంచందర్ నాయక్, బాలకృష్ణ నాయక్, అంజి నాయక్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. 2023లో మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేసినా, ఈరోజు వరకు పనులు మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు కంకర తేలి గుంతలు పడిందని, అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు, బ్రిడ్జి పనులు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్