కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సింగరేణి సీఎండీ ఎన్. బలరాంకు అవార్డును అందజేశారు. గత నెల గాంధీ జయంతి నుండి 30 రోజుల పాటు జరిగిన ఈ క్యాంపెయిన్‌లో సింగరేణి సంస్థ 355 ప్రదేశాలలో 765583 చదరపు అడుగుల విస్తీర్ణంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టి, 1,70,000 ఫైళ్లను పరిశీలించి, 56,200 నిరుపయోగ ఫైళ్లను తొలగించింది.