
విశ్వనాథ్ అండ్ సన్స్.. తొలిరోజు రూ.27.51 కోట్లు వసూళ్లు
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.51 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియాలో రూ.15.15 కోట్ల నెట్, రూ.17.51 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్లో రూ.10 కోట్లకు పైగా రాబట్టింది. తమిళంలో రూ.9.15 కోట్లు, తెలుగులో రూ.6 కోట్లు వసూలు చేసింది.




