మహిళల భద్రత, విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే నిర్మల్ జిల్లా పోలీసుల #MiPoliceAkka కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక SKOCH అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPS ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు, విద్యార్థినులు మరింత సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారని భావిస్తున్నారు.