దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నారు. దీంతో పాటు 26వ తేదీ నాలుగో శనివారం, 27వ తేదీ ఆదివారం సాధారణ సెలవులు కావడంతో బ్యాంకులు వరుసగా ఐదు రోజులు మూతపడనున్నాయి. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా పలు సమస్యలను పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.