అండమాన్ సముద్ర గర్భంలో సహజ వాయువు నిక్షేపాలు: ఆయిల్ ఇండియా ప్రకటన

12796చూసినవారు
అండమాన్ సముద్ర గర్భంలో సహజ వాయువు నిక్షేపాలు: ఆయిల్ ఇండియా ప్రకటన
ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) అండమాన్ సముద్ర గర్భంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. అండమాన్ దీవుల తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో చేపట్టిన అన్వేషణలో, 295 మీటర్ల లోతులో గ్యాస్ జాడలు లభ్యమయ్యాయి. కాకినాడ లేబొరేటరీలో పరీక్షించిన నమూనాలలో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలింది. రోజుకు ఎంత గ్యాస్ వెలికితీయవచ్చనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో గణనీయమైన హైడ్రోకార్బన్ నిల్వలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్