దోమల బెడదకు ' లెమన్ గ్రాస్'తో సహజ పరిష్కారం!

450చూసినవారు
దోమల బెడదకు ' లెమన్ గ్రాస్'తో సహజ పరిష్కారం!
ఇంట్లో దోమల బెడదను తగ్గించడానికి రసాయనాలతో కూడిన కాయిల్స్ లేదా లిక్విడ్‌లకు బదులుగా సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం శ్రేయస్కరం. వాటిలో లెమన్ గ్రాస్‌ వాడటం ఉత్తమం. ఇందులో ఉండే తీవ్రమైన సువాసన దోమలను ఇంట్లోకి రానివ్వదు. లెమన్ గ్రాస్‌లో సిట్రోనెల్లా అనే సహజమైన నూనె సమ్మేళనం ఉంటుంది. దీని నుండి వచ్చే బలమైన నిమ్మ సువాసన దోమలకు అస్సలు పడదు. లెమన్ గ్రాస్ ఆయిల్ ను నీటిలో కలిపి స్ప్రే చేయడం, గుమ్మం వద్ద, బాల్కనీలో మొక్కలు పెంచడం, దీపారాధన నూనెలో ఆయిల్ కలపడం వంటి పద్ధతులతో దోమలను నివారించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్