
వరల్డ్ చెస్ చాంపియన్ గుకేశ్‌కు షాక్.. మూడో రౌండ్లోనే ఔట్
గోవాలో జరుగుతున్న చెస్ వరల్డ్ కప్‌లో వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ ఎలిమినేట్ అయ్యాడు. మూడో రౌండ్లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ ఫ్రెడెరిక్ స్వాన్ చేతిలో 1.5-0.5 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. తొలి గేమ్ డ్రా అయినప్పటికీ రెండో గేమ్‌లో పరాజయంతో గుకేశ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన అతడు అంచనాలను అందుకోలేకపోయాడు.




