సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. అమ్మవారి అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయకూడదని పురోహితులు హెచ్చరిస్తున్నారు. నవరాత్రుల తొమ్మిది రోజులలో తామస ఆహారం, మద్యం, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. జుట్టు, గోర్లు కత్తిరించడం, తోలు వస్తువులను ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడదు. స్త్రీలను, పెద్దలను అగౌరవపరచకూడదని సూచించారు.