
టైమ్ ట్రావెల్ కథతో బాలయ్య మూవీ
బాలకృష్ణ 'అఖండ 2' సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కథాంశంతో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. 'కాంతార', 'కింగ్ ఆఫ్ కోత' వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన అర్వింద్ కశ్యప్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. అద్భుతమైన విజువల్స్, సినిమాటిక్ గ్రాండియర్ గా బాలయ్య - గోపిచంద్ సినిమా ఉండబోతుంది.




