హీరోయిన్ నయనతార పారితోషికం పెంచేసింది. స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో ప్రమోషన్లకు దూరంగా ఉండే నటి, ఇప్పుడు భారీ స్థాయిలో ప్రమోషన్లలో పాల్గొనడానికి అంగీకరించింది. ప్రమోషన్ల కోసం అదనంగా తీసుకుంటున్న పారితోషికాన్ని తన రెమ్యునరేషన్‌లో కలుపుకోవడంతో, ఆమె పారితోషికం 15 నుంచి 18 కోట్ల మధ్యకు చేరింది. గత పదేళ్లుగా సౌత్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నయనతార రికార్డు సృష్టించింది.