బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం 35 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మహాగఠ్‌బంధన్ కూటమి 12 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం లెక్కింపు పూర్తయ్యే టైంకి ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.