పుదుచ్చేరిలో ఎన్డీఏదే అధికారం: పీపుల్స్ పల్స్ సర్వే

138చూసినవారు
పుదుచ్చేరిలో ఎన్డీఏదే అధికారం: పీపుల్స్ పల్స్ సర్వే
పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఓట్ల శాతం పరంగా ఎన్డీఏ 34-36%, ఎస్‌పీఏ 30-32% ఓట్లు పొందుతుందని అంచనా. ఎన్డీఏలోని ఏఐఎన్‌ఆర్‌సి పార్టీ 10-12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచే పార్టీగా నిలవనుంది. సీఎంగా ఎన్.రంగస్వామికి 68% మంది మద్దతిస్తున్నారని, 60% మంది ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారని సర్వేలో తేలింది.

సంబంధిత పోస్ట్