ఢిల్లీ పార్లమెంట్‌లో ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం (వీడియో)

92చూసినవారు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయంపై ప్రధాని మోదీకి ఎన్డీయే నేతలు ఘన సన్మానం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి కీలక నాయకులు మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ రోజు లోక్‌సభలో SIRపై 10 గంటల పాటు చర్చ జరగనుంది.

సంబంధిత పోస్ట్